![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -289 లో......ధీరజ్ తో ప్రేమ తన ప్రేమ విషయం చెప్పాలని ట్రై చేస్తుంది. తనకి లవ్ ప్రపోజ్ చేసినట్లు ఉహించుకుంటుంది. కానీ అసలు విషయం ధీరజ్ కి చెప్పదు. మరొకవైపు నర్మదని చూసి సాగర్ తన వెంటే తిరుగుతాడు.
ఆ తర్వాత రామరాజు దగ్గరికి నర్మద వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడతాడు. రామరాజు కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతాడు. ఊళ్ళో రైస్ మిల్ లో నీ కొడుకు మూటలు మోసే వాడు.. అందుకే నా ఇంటికి ఇల్లరికం పంపండి. కలెక్టర్ వచ్చినప్పుడు అసలు నిన్ను పట్టించుకోలేదు కానీ నా కూతురు వల్ల నిన్ను గుర్తుపట్టాడని ప్రసాదరావు అంటాడు. అప్పుడు కూడా నేను రైస్ మిల్ ఓనర్ అని తెలిసే గౌరవం ఇచ్చాడని రామరాజు అంటాడు. నీ కొడుకు నా ఇంటికి వచ్చి మీ కూతురు హ్యాపీగా లేదని రమ్మన్నాడని చెప్పగానే రామరాజు షాక్ అవుతాడు. సాగర్ వంక చూసి నర్మదని.. బాగా చూసుకోవడం లేదా.. తను హ్యాపీగా లేదా అని అనేసి రామరాజు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
మరొకవైపు భద్రవతి, విశ్వ, భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. నేను మీకు హెల్ప్ చేయాలంటే ఆ నర్మద జాబ్ ఉండొద్దని భాగ్యం అనగానే భద్రవతి సరే అంటుంది. మరొకవైపు ధీరజ్ ని ఊహించుకొని ప్రేమ ఉహాల్లో తేలుతుంది. ఎలా నా ప్రేమ విషయం నీకు చెప్పాలని ఆలోచిస్తుంది. తరువాయి భాగంలో ప్రేమ, నర్మద ఉన్న ఫోటోని ధీరజ్ కి ప్రేమ ఇస్తుంది. ధీరజ్ ఓపెన్ చేస్తుండగా అమూల్యని విశ్వ ఏడిపించడం చూసి ధీరజ్ వచ్చి విశ్వతో గొడవపడతాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |